అధైర్య పడకండి అండగా ఉంటా
బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పాకాల రమాదేవి ని పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్ :జూన్ 3
మణుగూరు మండలం గాంధీ బొమ్మ సెంటర్ ఏరియాకి చెందిన బిఅర్ఎస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు పాకాల. రమాదేవి,తల్లి తోట లక్ష్మి (85) సంవత్సరాలు అనారోగ్యంతో మరణించారు.విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, వారి నివాసానికి వెళ్లి,తోట లక్ష్మి పార్దేవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి,కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అధైర్య పడవద్దని అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు విప్ రేగా కాంతరావు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహారావు పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కడప అప్పారావు కార్యదర్శి నవీన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కిరెడ్డి నరసింహారెడ్డి,యాదగిరి గౌడ్, లక్ష్మయ్య,రమణ,యువజన నాయకులు రవి ప్రసాద్,సృజన్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.