రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం*
*రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
*సిఎం కేసిఆర్ రైతుల పాలిట ఎంతో ప్రేమతో ఉన్నారు.
*ఎడ్లబండి ఎక్కి ర్యాలీతో రైతు వేదికకు చేరుకున్న మంత్రి.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం/ములుగు
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంమని రాష్ట్ర గిరిజన,స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.శనివారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామ రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఎడ్ల బండి ఎక్కి ర్యాలీతో రైతులను ఆనంద పరుస్తూ రైతు వేదిక ప్రాంగణానికి మంత్రి, జడ్పీ చైర్మన్,కలెక్టర్,ఎస్పీ చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్,జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య,ఎస్పీ గాష్ ఆలం,అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఓఎస్డీ అశోక్ కుమార్ లతో కలిసి హాజరై మాట్లాడారు.జిల్లాలో వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన మండలం గోవింద రావుపేట మండలం అని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ రైతుల పాలిట
ఎంతో ప్రేమతో ఉన్నారని,రైతు దినోత్సవ కార్యక్రమాలను చూస్తే అర్థమవుతుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తూ కేసీఆర్ రైతు బీమా,రైతు బంధు,ఆయిల్ ఫామ్ సాగుకు సబ్సిడీ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.రైతు పండించిన చివరి గింజ ప్రభుత్వమే కొనుగోలుచేసి సకాలంలో వారిఅకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామని గుర్తుచేశారు.ములుగు జిల్లా చివరిగా ఏర్పడినప్పటికీ జిల్లాపై ఎంతో ప్రేమ చూపిస్తూ ముఖ్యమంత్రి మెడికల్ కాలేజ్ సమీకృత భవనానికి 65 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభంలో ఉన్నాయని తెలిపారు.దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 22 వరకు సంక్షేమ సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహిస్తున్నామని వివరించారు.త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామన్నారు.రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి సాగునీరుకు ప్రాధాన్యత కల్పిస్తూ చెరువుల పూడికతీతతో బీడు భూముల్లో పచ్చదనం వెల్లివిరిసేలా వ్యవసాయానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రిదేనని అన్నారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దశబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుందని అన్నారు. ఆనాడు 50 ఏళ్ళపాటు ఉద్యమాలు చేసి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత మనదేనన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ గోవిందరావుపేట మండలం ప్రత్యేక వ్యవసాయ ప్రాధాన్యత కలిగిందని ఈ మండలంలో పెద్ద రైతులు ఉన్నారని అన్నారు.ఈ మండలంలో ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆయిల్ ఫామ్ సాగు ద్వారా రైతులు అధిక దిగుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని తెలిపారు. రైతులకు విత్తనాలు ఎరువులు సకాలంలో అందేలా అందుబాటులో ఉంచుతున్నామన్నారు.జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం రోజు గ్రామాల వారీగా రైతులకు అందుబాటులో ఉంటూ వ్యవసాయసాగుపై పలు సూచనలు ఇస్తున్నారని వారి ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ రైతులకు అందుబాటులో ఉంటున్నారని వారి కృషిని అభినందించారు.అనంతరం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల డాక్యుమెంటరీ చిత్రాలను ఎల్ఈడి స్క్రీన్ పై ఆసక్తిగా మంత్రి రైతులతో కలిసి తిలకించారు.అనంతరం రైతులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి,సర్పంచ్ ఈసం సమ్మయ్య, డిఆర్డీఓ నాగపద్మజ,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గౌస్ హైదర్,ఉద్యానవన శాఖ అధికారి రమణ,డిడబ్ల్యుఓ ప్రేమలత, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ హేమలత,ట్రైబల్ వెల్ఫేర్ డిడి పోచం,తహసిల్దార్ రాజ్ కుమార్,ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్,గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ రైతులు, మహిళలు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.