- ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు
- రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం
- -జడ్పీటిసి పోశం. నర్సింహారావు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:జూన్ 03
మణుగూరు మండలం లోని గుట్టమల్లారం గ్రామ పంచాయితీ పరిధిలోనీ రైతు వేదికలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది దినోత్సవాలలో భాగంగా వ్యవసాయ శాఖ అధ్వర్యంలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.రైతు వేదికల క్లస్టర్ పరిధి గ్రామాలలోని రైతులంతా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో సందడి చేస్తూ, ర్యాలీలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో మణుగూరు జెడ్పీటీసీ పోశం.నర్సింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం అన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల కోసం పెట్టుబడి సాయం చేసే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. రైతుబంధు పథకం అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఘనణీయంగా పెరిగిందన్నారు. రైతు బంధు పథకం తో పాటు రైతు బీమా అమలు చేయడం జరుగుతుందన్నారు.రైతు చనిపోతే వారి కుటుంబానికి అండగా ఉండాలని 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు.సాగునీరు,ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా రైతులకు ఎంతో లాభం జరుగుతుందన్నారు.వ్యవసాయం దండగ అన్న పరిస్థితి నుండి నేడు వ్యవసాయం పండుగల మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందన్నారు.రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం తెలిపారు.రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని,భవిష్యత్తులో రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. రైతులందరూ రైతు సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలని వారు కోరారు.ఈ సందర్భంగా గ్రామాలలో వ్యవసాయ రంగం లో సత్ఫలితాలు సాధించిన ఉత్తమ రైతులను ఎంపిక చేసి, వారిని ఘనంగా సన్మానించారు.అనంతరం రైతులంతా కలసి సహపంక్తి భోజనాలు చేశారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కే వి రావు,ఎమ్మార్వో నాగరాజు,ఎండిఓ.రాజమౌళి ఎంపీఓ వెంకటేశ్వర్లు,పిఎసిఎస్ వైస్ చైర్మన్ దొందేటి.మోహన్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్బాబురావు,ఎంపీటీసీల జిల్లా కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,ఎంపీటీసీలు కనితి.బాబురావు,తాటి సరిత, సమ్మక్క,రమ్య,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, సర్పంచులు బచ్చల భారతి,ఏనిక.ప్రసాద్,కారం.ముత్తయ్య,రాంబాబు,రామకృష్ణ,కృష్ణవేణి,కాయం.తిరుపతమ్మ,సతీష్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు,ఏఈవో లు,స్పెషల్ ఆఫీసర్ జి.శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది,మార్కటింగ్ శాఖ అధికారులు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.