మన్యం న్యూస్ గుండాల: ఆళ్లపల్లి మండలంలో నిర్వహించిన రైతు దినోత్సవం స్పందన లభించింది. ఆళ్లపల్లి, మర్కోడు కస్టర్లలో నిర్వహించిన రైతు దినోత్సవానికి రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ ఫలాలను అందిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఈ రైతు దినోత్సవం కార్యక్రమంలో ఉత్తమ రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజు భార్గవి, ఎంపీడీవో సత్యనారాయణ, వైస్ ఎంపీపీ ఎల్లయ్య, రైతు కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు