- తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం
- వెంటనే అమలు దిశగా చర్యలు చేపట్టాలి: ప్రజాపంథా
- పార్టీ నాయకులు చండ్ర అరుణ, షేక్ యాకుబ్ షావలి*
మన్యం న్యూస్,ఇల్లందు:సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర మహాసభ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇల్లందు పట్టణంలోని భవననిర్మాణ కార్మికుల అడ్డావద్ద తెలంగాణ దీక్ష దివస్ మీటింగ్ శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా హాజరైన ప్రజాపంథా పార్టీ రాష్ట్రనాయకులు చండ్ర అరుణ, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ యాకూబ్ షావలిలు మాట్లాడుతూ.. తెలంగాణ అమరులు కలలుకన్న స్వప్నాన్ని హేళన చేస్తూ కోట్లాది రూపాయల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో విందు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేసి తమ పరిపాలన గురించి గొప్పలు చెప్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం మరిచారని వారు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలని సకలజనుల ఆశయాలకు అనుగుణంగా సుపరిపాలన అందించాలని సూచించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు భూమి, కార్మికులకు పనిభద్రత కల్పించినప్పుడే అమరులు కన్నకలలు సాకారమవుతాయని ఇప్పటికైనా ఆ దిశగా కేసీఆర్ ఆలోచన చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ నాయకులు పిళ్లి మల్లేష్, మస్తాన్, శ్రీను, అనిల్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.