- ఘనంగా దశాబ్ది ఉత్సవాలలో రైతు దినోత్సవ వేడుకలు..
- మన తెలంగాణ దేశానికే అన్నపూర్ణ: ఎంపీపీ సున్నం లలిత..
- రైతులతో దద్దరిల్లిపోయిన రైతు వేదికలు..
మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి జూన్ 3: మండల కేంద్ర పరిధిలోని పది గ్రామ పంచాయతీల నుండి అధిక సంఖ్యలో రైతులు రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.మండల కేంద్ర ప్రధాన సెంటర్ నుండి రైతూ వేదిక వరకూ పాదయాత్ర తో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ సున్నం లలిత మాట్లడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడి పదోవ సంవత్సరంలో అడుగు పెట్టమని,ఈ పది సంవత్సరాలలో అనేక అద్భుతమైన ఫలితాలు సాధించామని చెప్పారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండూ పంటలకు రైతు బంధు సాయంతో పది వేల రూపాయలను అందజేస్తుందనీ చెప్పారు.రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వ్యవసాయ మార్కెట్ లను ఏర్పాటు చేశారనీ తెలియజేశారు.అంతే కాకుండా రైతులకు సకల సౌకర్యాలతో నూతన మార్కెట్ యార్డులు,ఆధునిక గోదాముల నిర్మాణం,17.35 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల అధనపు గోదాములు, రైతులకు విశ్రాంతి గదుల నిర్మాణం మొదలైన అనేక సౌకర్యాలు రైతుల కోసం ఏర్పాటు చేశారని తెలియజేశారు.అనంతరం రైతులకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు,పంచాయతీ అధికారులు,జడ్పిటిసి భారత్ లావణ్య,ఎంపీటీసీలు,సర్పంచులు,ఫీల్డ్ అసిస్టెంట్లు,రైతులు తదితరులు పాల్గొన్నారు.