- రైతులకు తక్షణమే రుణమాఫీ అమలు చేయాలి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
- ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఇల్లందు నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జ్ బాధావత్ ప్రతాప్
మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా చేపట్టిన రైతు దినోత్సవానికి సంబంధించి శనివారం స్థానిక ఇల్లందు బీఎస్పీ పార్టీ కార్యాలయంలో ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జ్ బాదావత్ ప్రతాప్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో ఇతర వర్గాల వారికి న్యాయం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మాత్రం మొండిచేయి చూపిందన్నారు. రైతులకు రైతుబందు, రైతుభీమా, ఉచిత కరెంట్ అంటూ వాగ్దానాలు ఇచ్చిన ప్రభుత్వం నేడు వాటి సక్రమంగా అమలు చేయకుండా నేడు రైతు దినోత్సవం జరుపుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. కెసిఆర్ గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ హామీని ఎందుకు అమలు చేయలేదని, రైతు పండించిన ప్రతిపంటను గిట్టుబాటు ధరలకు కొంటామని చెప్పి తొమ్మిదేళ్లుగా గిట్టుబాటు ధర కల్పించలేదని యాసంగి, వరి కొనుగోలు ఎందుకు ఆలస్యం అవుతుందొ రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. ఇకనైనా రాష్ట్రప్రభుత్వం రైతన్నలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లేతకుల కాంతారావు, జిల్లా సీనియర్ నాయకులు రాయల శ్రీనివాసరావు, పప్పుల గోపీనాథ్ మరియు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు