మన్యం న్యూస్, పినపాక:
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకలలో వ్యవసాయ అధికారులు , ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం పినపాక వారు కలిసి నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో ఉమ్మడి పినపాక మండలంలో వున్న 5 రైతు వేదికలు పినపాక, బయ్యారం, జానంపేట, కరకగుడెం, అనంతారంలలో రైతు సోదరులతో మంచి వాతావరణం నెలకొంది. ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం, పినపాక పిలుపు మేరకు రైతులు తమతమ రైతు వేదికలకు అధిక సంఖ్య లో హాజరయ్యారు. క్లస్టర్ పరిది లో గల ఉత్తమ రైతులని మండల విస్తరణ అధికారుల సమక్షంలో ముగ్గురు ఉత్తమ రైతులకు గాను మొత్తం 15 మంది రైతులకి పిఎసిఎస్ అధ్యక్షుల నిర్ణయం తో సంఘ డైరెక్టర్లు ఉత్తమ రైతులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించటం జరిగింది. అలాగే ఉత్తమ రైతులతో వారు వ్యవసాయం లో అవలంబించిన విదానాన్ని వచ్చిన రైతులకి వివరించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ భోజన సదుపాయం కల్పించారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సురేష్ రెడ్డి, తహసిల్దార్ ప్రసాద్ , రెవిన్యు సిబ్బంది, మండల అభివృద్ధి అధికారి చంద్రశేఖర్, ఎస్సై నాగుల్ మీరా , పంచాయితి సెక్రెటరీలు, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు సీఈవో సునీల్, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు , సంఘ డైరెక్టర్లు, సంఘ సిబ్బంది , రైతులు పాల్గొన్నారు.