- మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనాల అమలు కోసం కృషి చేస్తా
- -వేజ్ బోర్డు సలహా మండలి సభ్యులు సానికొమ్ము శంకర్ రెడ్డి హామీ
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:జూన్ 4
మణుగూరు మండలం లో మిషన్ భగీరథ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాల అమలు కోసం సమ్మె నోటిస్ ఇచ్చిన నేపథ్యంలో స్పందించిన వేజ్ బోర్డు సలహా మండలి సభ్యులు సానికొమ్ము శంకర్ రెడ్డి కనీస వేతనాలు అమలు కోసం రాష్ట్ర వెజ్ బోర్డు సలహా మండలి చైర్మన్ తో చర్చించి,వేతనాలు అమలు కోసం కృషి చేస్తానని కార్మికుల కు హామీ ఇచ్చారు.సమ్మెకు వెళ్లవలసిన అవసరం లేదని, కాంట్రాక్ట్ కార్మికులకు భరోస కల్పించారు.ఆదివారం మణుగూరు మండలంలో ఉన్న మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద కాంట్రాక్టు కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సానికొమ్మ శంకర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం లో క్షేత్ర స్థాయిలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, జీవన విధానంలో మార్పు తేవడం కోసం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కనీస వేతనాల సలహా మండలి సభ్యుడిగా తనకు అవకాశం కల్పించినారని,అందుకోసం తాను నిత్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.కాంట్రాక్ట్ కార్మికుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కోసమే,రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి బోర్డు పనిచేస్తుందని అన్నారు.ఈ సందర్భంగా కార్మికులతో జరిపిన చర్చలు ఫలించాలని,భవిష్యత్తులో చేయబోయే మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకన్న గౌడ్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.