UPDATES  

 ఘనంగా సురక్ష దినోత్సవం *శోభాయమానంగా పోలీస్ ర్యాలీ.

ఘనంగా సురక్ష దినోత్సవం
*శోభాయమానంగా పోలీస్ ర్యాలీ.
*అబ్బురపరిచిన పోలీస్ విన్యాసాలు.
*శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
.
*మన్యం న్యూస్ ఏటూరు నాగారం/ములుగు

శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలో నే నెంబర్ వన్ గా నిలుస్తున్నా రని జిల్లా రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాష్ ప్రశంసించారు.తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది వేడుకలలో భాగంగా 3వ రోజు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుంచి బండారుపల్లి రోడ్డులో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్ వరకు సురక్షా దినోత్సవం సంద ర్భంగా నిర్వహించిన పోలీస్ ర్యాలీ శోభాయ మానంగా సాగింది.రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాష్, జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య,ఎస్పీ గౌష్ ఆలం,డిఎఫ్ఓ రాహుల్ జాదవ్,ఓఎస్ డి అశోక్ కుమార్,జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతిలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర జలవన రుల సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాష్ మాట్లాడుతూ.తెలంగాణ పోలీసులు యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని అన్నారు. కోవిడ్ సంక్షోభం సమయం లోను తమ ప్రాణాలను సైతం లెక్కచేయ కుండా పోలీసులు ప్రజలకు అందించిన సేవలు మరువలే నివని అభినందించారు.తెలం గాణ రాష్ట్ర ప్రగతికి పోలీసులు వెన్నుముకగా నిలుస్తున్నారని కొనియాడారు.ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్,ఎస్పీమాట్లాడుతూ
ఏ ప్రాంత మైనా అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు నెలకొని ఉండడం ఎంతో అవసరమని అన్నారు.అప్పుడే పర్యాటకప రంగా, పారిశ్రామి కంగా పెట్టుబ డులను ఆకర్షిం చేందుకు వీలు ఉంటుంద న్నారు.ప్రభుత్వంఅందిస్తున్నతోడ్పాటు,సమకూరుస్తున్న అధునాతన వసతులతో తెలంగాణ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు.ఫలితంగా తెలంగాణ రాష్ట్రాని కి పెద్ద ఎత్తున పెట్టు బడులు వస్తున్నాయని హర్షం వెలిబుచ్చారు.నేటి సమాజంలో కొత్త కొత్త పద్ధతుల్లోనేరాలుచోటుచేసుకుంటుండగా,అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పోలీసు లు సైతం నేరాల నియంత్రణకు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.అన్ని వర్గాల ప్రజలకు పూర్తిస్థాయిలో భద్రత ను కల్పిస్తూ శాంతి భద్రతలు నెలకొని ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పోలీస్ శాఖకు అధునాతన సదుపాయాలనుసమకూరుస్తోందన్నారు. ఇందులో భాగంగానే పెట్రో కార్స్,బ్లూ కోల్డ్స్,జిల్లా స్థాయి లోనూ కమాండ్ కంట్రోల్ స్టేషన్స్,షీ టీమ్స్,భరోసా సెంట ర్స్ వంటివి శాంతిభద్రతల పరి రక్షణకు ఎంతగానో ఉపయు క్తంగా నిలుస్తున్నాయని అన్నారు.పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా హరిత హారం వంటి ప్రభుత్వ ప్రాధా న్యత కార్యక్రమాల్లో క్రియాశీ లకంగా మమేకం అవుతున్నా రని, అనేక సామాజిక కార్య క్రమాల్లోనూ భాగస్వాములు అవుతున్నారని అన్నారు.
అనునిత్యం 24 గంటల పాటు విధి నిర్వహణ లో నిమగ్నమై ఉంటూ పోలీసులు అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని ప్రశంసించారు.అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసిన సురక్ష దినోత్సవ సమా వేశంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం శుభాకాంక్షలు తెలిపారు.శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉప యోగించే అధునాతన సాధనాలు,ఆయుధాల గురించి సవివరంగా తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమం అందరిని ఆకర్షిం చింది.పోలీసుల వివిధ విభాగా ల్లో నిర్వహించిన విన్యాసాలను అతిథులు ఆసక్తిగా తిలకించా రు.సాంస్కృతిక కార్యక్రమాల తో కళాకారులు ఆటపాటలతో సభికులను అలరించారు.ఈ సమావేశంలో ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి,జడ్పి సీఈఓ ప్రసన్న రాణి,డిపిఓ వెంకయ్య,డిడబ్ల్యూఓ ప్రేమలత,
ములుగు సబ్ రిజిస్టార్ తస్లీమా,ఏఎస్పీ,సదానందం,సీఐలు,ఎస్సైలు సంబంధిత శాఖ అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !