మన్యంన్యూస్,ఇల్లందు:తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం పదిగంటలకు సింగరేణి పాఠశాల మైదానం నందు జరిగే సింగరేణి సంబరాలలో ఉద్యోగులు వారి కుటుంబసభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ఇల్లందు బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఎస్ రంగనాథ్ పిలుపునిచ్చారు. ఈ సంబరాలలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు హరిప్రియ హరిసింగ్ నాయక్, సింగరేణి జనరల్ మేనేజర్, అధికారులు, మహబూబాబాద్ పార్లమెంట్ సబ్యురాలు మలోత్ కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాత మధుసూదన్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ డీవీ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గడచిన తొమ్మిది సంవత్సరాలలో సింగరేణి ప్రగతి నివేదిక, సింగరేణి స్టాల్స్ ప్రదర్శన, సావనీర్ ఆవిష్కరణ, ఉత్తమ కార్మికులకు సన్మానం, బహుమతుల ప్రధానం, డిపెండెంట్లకు ఉదోగ నియామక పత్రాలు, గృహవడ్డీ రీయింబర్స్మెంట్ పత్రాలు, మెరిట్ స్కాలర్ షిప్ నగదు బహుమతులు, తెలంగాణ సాస్కృతిక కార్యక్రమాలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ సింగరేణి సంబరాలలో ఉద్యోగులందరికీ స్వీట్ పాకెట్స్ అందించనున్నామని తెలిపారు. ఉద్యోగుల కుటుంబసభ్యుల కొరకు ఓల్డ్ కాలనీ, జేకే, కేఓసీ కాలనీలలో బస్సు సొకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా కార్మికులకు సభ అనంతరం తెలంగాణ రుచులతో కూడిన చక్కని భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కావున కార్మికులు, వారి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి సకాలంలో వచ్చి విజయవంతం చేయాలని కార్మికనేత రంగనాథ్ కోరారు.