మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలోని పినపాక గ్రామానికి చెందిన చామకూరి భగవంతు అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా, అతని గురించి ఫేస్బుక్, వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్న మణుగూరు మండల బీ.ఆర్.ఎస్ నాయకురాలు,రేగా వీరాభిమాని రమా సుధాకర్ మానవత్వంతో స్పందించి రూ. 3001 రూపాయల ఆర్థిక సహాయం అందించిన విషయం విధితమే. మరో ముగ్గురు వారికి తోచిన ఆర్థిక సహాయం అందించగా వచ్చిన మొత్తం రూ.4101/-లను ఆదివారం పినపాక బి.ఆర్.ఎస్ నాయకులు, ఉమ్మడి పినపాక పంచాయతీ మాజీ సొసైటీ డైరెక్టర్ చిర్రా రాములు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. పినపాక గ్రామానికి చెందిన రేగా వీరాభిమాని కొత్త దామోదర్ గౌడ్ కూడా భగవంతు నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న దాతలు 9160647647 నెంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆర్థిక సహాయం అందించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.