UPDATES  

 లక్షగొంతుకల రణ నినాధమే ప్రజాగర్జన బహిరంగ సభ

లక్షగొంతుకల రణ నినాధమే ప్రజాగర్జన బహిరంగ సభ
ప్రజా సమస్యల ఎజెండాను పాలకులముందు ఉంచుతాం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ప్రజాగర్జన బహిరంగ సభ’ ప్రచార వాల్ పోస్టర్ ఆవిష్కరించిన సిపిఐ నేతలు

నియోజకవర్గంలో విస్తృత ప్రచారం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎజెండాగా చేసుకొని జూన్ 11న నిర్వహిస్తున్న ప్రజాగర్జన బహిరంగ సభ లక్ష గొంతుకల రణ నినాధమని, పాలకులు ప్రజా సమస్యల ఎజెండాపై స్పందించకుంటే పోరాట ఉదృతిని పెంచిపాలకుల్లోవణుకుపుట్టిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. జూన్ 11న భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజాగర్జన బహిరంగ సభ ప్రచార వాల్ పోస్టర్లు, కరప్రతాలను ఆదివారం చుంచుపల్లి మండలం, గౌతంపూర్ కాలనీ సింగరేణి కార్మిక ప్రాంతంలో ఆవిష్కరించి విడుదల చేశారు. అనంతరం మండలంలోని రుద్రంపూర్, గౌతంపూర్, పెనుబల్లి, పెనగడప, ఇంక్లైన్ల ఏరియా, ఉమ్మడి చుంచుపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలు, బస్తిలు, కార్మిక క్షేత్రాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభల్లో కూనంనేని మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, పోడు సాగుదారులకు పట్టాలు, రాజ్యాంగ, లౌకిక వ్యవస్థల పరిరక్షణ ఎజెండాగా బహిరంగసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. బిజెపి పాలనలో ప్రజల్లో అభద్రతాభావం నెలకొందని, ఈ పరిస్థితిలో ప్రజలందరూ ఏకమై దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతిపరులు, అక్రమాలర్కులకు బిజెపి అండగా నిలుస్తోందని, ప్రజలకు చెందాల్సిన సంపదను కార్పోరేట్ శక్తులకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. హిందుత్వ ఎజెండాతో ప్రజల మద్య చిచ్చుపెడుతూ రాజ్యాంగ, లౌకిక వ్యవస్థ బ్రస్టుపట్టిస్తున్నారని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని విస్మరించిందని, కార్మిక చట్టాలను రద్దుచేసి వారి హక్కులను కాలరాస్తున్నారని, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలతో ప్రజల నడ్డివిరుస్తున్నారని విమర్శించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా మాట్లాడుతూరాష్ట్రంలో 2.99లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ సర్వేతోనే కాలం వెల్లదీస్తున్నాడని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగుల క్రమబద్దీకరణ, పోడు భూముల సమస్య, సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యను ఏండ్లు గడుస్తున్నా పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఎజెండాగా చేసుకొని జూన్ 11న కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో లక్ష మందితో రాష్ట్ర స్థాయి ప్రజాగర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీలు, సంఘాలకతీతంగా ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు తరళిరావాలని పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, దుర్గరాశి వెంకటేశ్వర్లు, సలిగంటి శ్రీనివాస్, మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, జిల్లా సమితి సభ్యులు జి.వీరస్వామి, వట్టికొండ మల్లికార్జున్రావు, కె.రత్నకుమారి, నాయకులు తోట రాజు, గుమ్మడి సాగర్, సంపతావు, రాంచందర్, సలిగంటి బాబు, బాగం మహేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !