మన్యం న్యూస్: జూలూరుపాడు, జూన్ 25, మండల పరిధిలోని కరివారిగూడెం గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడు తాటికొండ కృష్ణారావు అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, వెంగన్నపాలెం ఎంపిటిసి దుద్దుకూరి మధుసూదన రావు, ధారావత్ రాంబాబు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బొడ్డు కృష్ణయ్య, ముత్తినేని రామయ్య, మంగీలాల్ నాయక్, నున్న కృష్ణయ్య, లచ్చు నాయక్, మాజీ ఎంపీపీ లాలు నాయక్, మాచినేని పేట తండా మాజీ సర్పంచ్ వాల్యా, పశు వైద్యాధికారి బద్దులాల్ లు కృష్ణారావు భౌతిక దేహాన్ని సందర్శించి పూలమాలలేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని తెలిపారు.