బిటిపిఎస్ ప్రాజెక్ట్ హాస్టల్ ని ప్రారంభించిన సిఅండ్ ఎండి
మన్యం న్యూస్, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గల భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ ప్రాజెక్ట్ హాస్టల్ ను తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సి అండ్ ఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కార్మికుల కోసం నిర్మించనున్న బిటిపిఎస్ టౌన్ షిప్ భూమి పూజలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ యాదాద్రి , భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారని , తద్వారా రాష్ట్ర ప్రజలందరికీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ డైరెక్టర్ అజయ్ కుమార్, బిటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ బి. బిచ్ఛన్న, సంబంధిత అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.