మన్యం న్యూస్ చర్ల :
భారతీయ జనతా పార్టీ చర్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం చర్ల మండలంలో గడపగడపకు బిజెపి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ,రాస్ట్ర కార్యదర్శి కుంజ సత్యవతి హాజరయ్యారు.. ప్రధానమంత్రి మోదీ 9 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మోడీ దేశంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి లక్ష్మీ కాలనీ,విజయ కాలనీ బూత్ నందు ప్రజలకు వివరించడం జరిగింది.. కరోనా కష్టకాలం నుండి పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి ఉచితరేషన్ అందిస్తున్నది నరేంద్ర మోడీ అని, కిసాన్ సమ్మన్ నిధి ద్వారా 11 కోట్ల రైతుల ఖాతాలకు ఏడాదికి 6000 రూపాయలు బదిలీ చేస్తున్న ఘనత నరేంద్ర మోడీ గారిదే నని, ఉజ్వల యోజనతో 9.6 కోట్ల మహిళలకు పొగ చూరిన కట్టెల నుంచి విముక్తి కల్పించిన ఘనత బిజెపి ప్రభుత్వానిదని, ఆయుష్మాన్ భారత్ ద్వారా 23. 34 కోట్లకు పైగా వైద్య బీమా కార్డులు జారీ చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని, దేశవ్యాప్తంగా 220 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దక్కుతుందని ప్రజలకు వివరించడం జరిగింది. రాబోవు కాలంలో మరొకసారి బిజెపి ప్రభుత్వాన్ని బలపరచాలని కోరడం జరిగింది .ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ బిట్రగుంట క్రాంతి కుమార్,జిల్లా కార్యవర్గ సభ్యులు సంతపురి సురేశ్,ప్రదాన కార్యదర్శి పుగాకు పూర్ణ చందు,
ఎడవల్లి శేషగిరిరావు,ఉపాధ్యక్షులు
ముత్తారం రత్తయ్య,కార్యదర్శి కొండేటి చంద్ర శేఖర్,రాచకొండ అనిల్,మచ్చ కుమార్,కేత సంతోష్, శరత్, సాయిరాం,వరద రాజు తదితరులు పాల్గొన్నారు .