మన్యం న్యూస్ మణుగూరు: జూన్ 25
మణుగూరు లయన్స్ క్లబ్ నూతన ప్రెసిడెంట్ గా గాజుల పూర్ణ చందర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు.లయన్స్ క్లబ్ మణుగూరు 29 వ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ప్రస్తుత ప్రెసిడెంట్ దండ. రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది.2023-24 నూ తన ప్రెసిడెంట్ గా గాజుల పూర్ణ చందర్ రావు,ఎస్కే.మీరా హుస్సేన్,ట్రేసరర్ గా అడబాల. నాగేశ్వర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మణుగూరు డిఎస్పీ రాఘవేంద్ర రావు పాల్గోన్నారు.ఈ సందర్భంగా డిఎస్పీ రాఘవేంద్ర రావు మాట్లాడుతూ,మణుగూరు లో లయన్స్ సేవలు 28 సంవత్సరాలు గా విశేష సేవలు అందించారన్నారు.చార్టర్ ప్రెసిడెంట్ హరిబాబు నేత్రుత్వంలో,ఎన్నో రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు చేరువయ్యారు అన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం,విరామ సమయం లో సమాజ సేవకొరకు ఉపయోగించడం లయన్స్ వారు అవున్నత్యానికి నిదర్శనం అని తెలిపారు.ఈ సంవత్సరం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా నూతన ప్రెసిడెంట్ గాజుల పూర్ణ చందర్ రావు షష్ఠి పూర్తి వేడుకలను లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు.పూర్ణ
దంపతులకు లయన్స్ క్లబ్ సభ్యులు,బంధు మిత్రులు,షష్టి పూర్తి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పాస్ట్ గవర్నర్ లు,కపా మురళీ కృష్ణ,దరా కృష్ణా రావు,ప్రోగ్రాం చైర్ పర్సన్ గాజుల రమేష్ కుమార్, కె.చంద్రమోహన్,దోసపాటి.నాగేశ్వరరావు,బి.వేంకటేశ్వర్లు,డాక్టర్ సమ్మయ్యా,బోలిసెట్టి.అనంద్ భాస్కర్,పురప్రముఖులు పాల్గొన్నారు.