మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిధిలోని పొలకమ్మతోగు గ్రామానికి చెందిన కరకగూడెం సర్పంచ్ ఊకె. రామనాథం తండ్రి ఊకె. వీరయ్య అనారోగ్యంతో ఇటీవల కాలంలో మరణించారు.ఆదివారం జరిగిన ఆయన దిశ దిన కర్మలకు టి పీసీసీ సభ్యులు డాక్టర్ చందా.సంతోష్ కుమార్,మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ హాజరై చిత్ర పాఠనికి పూల మాలలువేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో భట్టుపల్లి సర్పంచ్ తోలెం.నాగేశ్వరరావు, గుండాల,అళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడెం.ముత్యమచారి, పాయం.రామ్ నర్సింహరావు,సీనియర్ నాయకులు పోలెబోయిన. ముత్తయ్య,చందా. వెంకటరత్తమ్మ,వంకుడోత్.రమేష్,నాగబండి.వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
