జేబీసీసీఐ కార్యదర్శి పి మాధవనాయక్ మన్యం న్యూస్,ఇల్లందు:సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ ఏబీకేఎంఎస్- బీఎంఎస్ ఆధ్వర్యంలో ఇల్లందు ఏరియాలోని జేకే ఓసీ నందు ఆదివారం సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ సమావేశంలో జేబీసీసీఐ కార్యదర్శి పి.మాధవ నాయక్, బీఎంఎస్ ఇల్లందు బ్రాంచి ఉపాధ్యక్షులు నాయని సైదులు ముఖ్యఅతిధులుగా హాజరై మాట్లాడుతూ.. 11వ వేతన ఒప్పందం చారిత్రాత్మకమైందని 19శాతం ఎంజిబి ఇరవైఐదు శాతం అలవెన్స్ లపై పెరుగుదల సాధించడంలో బిఎంఎస్ కీలకపాత్ర పోషించిందని పేర్కొన్నారు. అదేవిధంగా పెరిగిన కొత్తజీతాలు జూన్ నెల నుండే కార్మికులకు అమలుకై కొత్తకాపు లక్ష్మారెడ్డి కేంద్ర బొగ్గుగనుల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషితో మాట్లాడి త్వరగా అమలుచేయడానికి తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగా ఈ నెలలో కోల్ ఇండియావ్యాప్తంగా అమలు అవుతోందన్నారు. బీఎంఎస్ కృషి ఫలితమే ఈ పెరిగిన జీతాలని, వాటి అమలుకై బీఎంఎస్ అలుపెరగని పోరాటం చేసిందని తెలిపారు. బీఎంఎస్ ఒత్తిడి మేరకు సింగరేణి యాజమాన్యం జూన్ నెలనుండి కొత్తజీతాలను కార్మికులకు అందించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు వారు పేర్కొన్నారు. అదేవిధంగా సింగరేణి లాభాల్లో కార్మికులవాటా ఈ నెల జీతంతోనే చెల్లించాలని బీఎంఎస్ డిమాండ్ చేస్తోందని వారు అన్నారు. జేకే ఓసీ కార్మికులకు ఏసీ సౌకర్యాన్ని కల్పించి విశ్రాంతి గదులను మరియు క్యాంటీన్లో లంచ్ ఏర్పాటు చేయాలనీ యాజమాన్యాన్ని కోరారు. జేకేఓసీ కార్మికులను ఇతరప్రాంతాలకు బదిలీచేయకుండా ఇక్కడే సర్దుబాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ యూనియన్ కార్యదర్శి మాధవరెడ్డి, ఇల్లందు ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజశేఖర్, పిట్ సెక్రటరీ నాగేశ్వరావు, కార్యవర్గసభ్యులు రాము, వెంకటేశ్వర్లు, కార్తీక్, సురేష్, శ్రీను, క్రాంతి, వెంకటేష్, శివ, పరంజ్యోతి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు
