ఇల్లందును అభివృద్ధిలో పరుగులు పెట్టించి నూతన అధ్యాయానికి తెరలేపిన హరిప్రియ నాయక్* హరిప్రియకి పట్టం కట్టేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్దం
మన్యంన్యూస్,ఇల్లందు*:రాష్ట్రంలో మారుమూల ప్రాంతమైన ఇల్లందు నియోజకవర్గం ఏళ్లతరబడి అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడి ఉన్న తరుణంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అనే ధ్యేయంతో ప్రజలకు సేవచేసేందుకు ముందుకు వచ్చిన ప్రజానాయకురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ అని పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు పీవీ కృష్ణారావు అన్నారు. ఈ మేరకు విలేకరులతో ఆయన మాట్లాడుతూ..తొలుత తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి ఓటమిని చవిచూసినప్పటికీ అంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీచేసి ప్రజల మమకారాన్ని పొందిన జననేత హరిప్రియ నాయక్ అని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చి నాలుగు సంవత్సరాల కాలంలోనే ఇల్లందు నియోజకవర్గ ముఖచిత్రం మారేందుకు అలుపెరగని కృషిచేసిన నిరంతర శామికురాలు హరిప్రియ హరిసింగ్ నాయక్. అనతికాలంలోనే రాజకీయ విశ్లేషకులకందని విధంగా వందలకోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఘనత ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ కి దక్కిందన్నారు. గతంలో ఇల్లందులో ఎందరో నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ స్వలాభం తప్ప ప్రజా ప్రయోజనాలను గాలికొదిలేసేవారని కానీ నేడు విద్యావంతురాలైన ఎమ్మెల్యే హరిప్రియ రాకతో ఇల్లందు రూపురేఖలు మారాయన్నారు. తను నిండుగర్భిణీతో ఉన్నప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తూ నియోజకవర్గంలో కలియ తిరుగుతూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండేవారు హరిప్రియ నాయక్. చంటిపాప పుట్టి మూడు నెలలు కాకముందే అటుతల్లిగా పాప ఆలనాపాలనా చూసుకుంటూ ప్రజలకొరకు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషిచేసిన మహానాయకురాలు హరిప్రియ నాయక్ అని పీవీ కృష్ణారావు పేర్కొన్నారు. గెలిచిన నాటినుంచి నేటివరకు ఇల్లందు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటు, కష్టం ఉందని తెలిస్తేచాలు అక్కడకి వెళ్ళి తనవంతు సాయంచేస్తూ కుటుంబంలో ఒకరిగా హరిప్రియ నాయక్ నిలిచారని తెలిపారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నియోజకవర్గానికి రాష్ట్రంలో పేరుప్రఖ్యాతలు దక్కేలా చేసిన ఘనత ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కే దక్కిందన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఆత్మీయసమ్మేళనాలు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం పిలుపునిచ్చిన వెంటనే ఐదు మండలాలు, ఇల్లందు పట్టణంలో అంగరంగ వైభవంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి వేలమంది జనాలతో, కార్యకర్తలతో విజయవంతం చేయడం జరిగిందనన్నారు. జూన్ 2 తారీకు నుండి జూన్ 22వ తారీకు వరకు రాష్ట్రప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని, రాష్ట్రప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు దాటి పదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని రోజుకొక కార్యక్రమాన్ని 21 రోజులుగా జరపాలని నిర్ణయించారు. హరిప్రియ హరిసింగ్ నాయక్ నాయకత్వంలో ప్రభుత్వ అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అధికమొత్తంలో హాజరై ఇల్లందు మార్కెట్ యార్డు, వైద్యవిధాన పరిషత్, మంచినీటి చెరువుకట్ట తదితర ప్రాంతాలలో వేలమందితో సభలు నిర్వహించి వారితో సహపంక్తి భోజనాలు చేయడం జరిగిందినీ అన్నారు. చివరిరోజు తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడిన ఉద్యమనేతలకు సన్మానంచేసి, అమరులైన ఉద్యమకారులకు గుర్తుగా స్తూపం శంకుస్థాపన చేయడం జరిగింది.రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3000 పైచిలుకు తండాలను గ్రామపంచాయతీలుగా చేసి ప్రత్యేకనిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించడంలో ఎమ్మెల్యే విశేషకృషి దాగుందన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు ఇస్తామని ఎవరు ఆందోళన చెందవద్దని హైదరాబాదులో మంత్రి కల్వకుట్ల తారకరామారావు, అల్లం నారాయణలతో మాట్లాడడం జరిగిందని అతిత్వరలోనే జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చేవిధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో కురిసిన అకాలవర్షాల వల్ల పంట నష్టపోయిన రైతన్నలకు ఎకరాకు పదివేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించేవిధంగా మన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆధ్వర్యంలో సర్వే చేయించి రాష్ట్రప్రభుత్వానికి నివేదిక అందించిన తరుణంలో 1.30 లక్షల రూపాయలు ఇల్లందు మండలానికి శాంక్షన్ చేయించి నియోజకవర్గంలోని రైతుల ముఖాల్లో చిరునవ్వులు చిందెలా ఎమ్మెల్యే హరిప్రియ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఇన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూప్రజలే ప్రాణంగా ముందుకు సాగుతున్న ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ పై కొందరు అసత్య ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీవీ కృష్ణారావు పేర్కొన్నారు. మరోమారు తమస్వలాభం కోసం బూటకపు మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే నమ్మే పరిస్తితిలో నియోజకవర్గ ప్రజలు లేరని, రానున్న ఎన్నికల్లో ఇల్లందులో ప్రతిపక్ష అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారని ఆయన తెలిపారు. ప్రజాసేవకు కంకణం కట్టుకున్న హరిప్రియమ్మను అప్రతిష్టపాలు చేయాలని చూస్తే సహించేది లేదని అటువంటి వారిని రాజకీయ బొందపెట్టడం ఖయమని ఖబర్థార్ అంటూ హెచ్చరించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే హరిప్రియకు రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు చూస్తున్నారని ప్రజాభిమానం కలిగిన హరిప్రియమ్మకు రానున్న ఎన్నికల్లో ఎదురేలేదని ఇల్లందు గడ్డ హరిప్రియమ్మ అడ్డ అని ఆయన వ్యాఖ్యానించారు
