మన్యం న్యూస్, పినపాక:
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు లక్ష రూపాయలు రుణాలు ప్రకటించిన నేపథ్యంలో దరఖాస్తు చేసిన లబ్ధిదారుల సర్వే కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పినపాక మండలం దుగినే పల్లి గ్రామంలో సర్వే నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటింటికి తిరుగుతూ ధ్రువపత్రాలను పరిశీలించారు. అర్హులను ఎంపిక చేసే నిమిత్తమై సర్వే నిర్వహిస్తున్నట్లుగా ఎంపీడీవో చంద్రశేఖర్ తెలియజేశారు. కులవృత్తుల ఆధారంగా బీసీ రుణాల ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో సర్వే పూర్తి చేస్తామని ఎంపీడీవో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.