మన్యం న్యూస్ గుండాల: జర్నలిస్టులకు ప్రజాస్వామిక వాదులు అండగా నిలవాలని పీ వై ఎల్ జిల్లా కార్యదర్శి వాంకుడోత్ అజయ్ కోరారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తులసి చంద్ జర్నలిస్ట్ వార్త రాసినందుకు బిజెపిలోని కొందరు మతోన్మాద వాదులు కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన మోడీ, షా అనుకూలవాదులు ఆమెను బెదిరింపులకు దిగుతున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడే మీడియా పై బెదిరింపులకు దిగడం ఏమిటని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలను వెలికి తీసే వారిని బెదిరించే విధానాన్ని మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కృష్ణ, మండల అధ్యక్షులు కుమార్, కార్యదర్శి మంగయ్య, నాయకులు జగన్ , మోహన్, సురేష్, కృష్ణ, పాపారావు తదితరులు పాల్గొన్నారు
