UPDATES  

 ముదిరాజులకు భేషరతుగా క్షమాపన చెప్పాలి ఎమ్మెల్సీ పాడి.కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం.

  • ముదిరాజులకు భేషరతుగా క్షమాపన చెప్పాలి
  • ఎమ్మెల్సీ పాడి.కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం.
  • పాడి.కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుండి భర్తరఫ్ చెయ్యాలి.
  • మణుగూరు మండల ముదిరాజ్ సంఘం డిమాండ్

మన్యం న్యూస్ మణుగూరు: జూన్ 25

అగ్రకుల దురహంకారంతో, ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తిని కులం పేరుతో దూషిస్తు యావత్ ముదిరాజ్ కులం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి.కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ని వెంటనే భర్తరఫ్ చేయాలని ముదిరాజ్ మహాసభ మణుగూరు డివిజన్ ముదిరాజ్ సంఘం డిమాండ్ చేశారు.అవమానకరంగా ముదిరాజ్ కులస్తులను మాట్లాడిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ మాపన చెప్పాలని డిమాండ్ చేస్తూ,మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పాడి.కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.ముదిరాజ్ కులస్తుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పై మణుగూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులకు వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముదిరాజ్ కులస్తులు విజ్ఞప్తి చేస్తూ,ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.ముదిరాజ్ మండల అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ,ముదిరాజ్ కులస్థుని పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.జెఎస్ ఆర్ చానెల్ కెమెరా మెన్ బండి అజయ్ ముదిరాజ్ ను అసభ్య పదజాలం,కులం పేరు తో దూషిస్తూ,చిత్ర హింసలకు గురి చేసిన పాడి కౌశిక్ రెడ్డిని రోడ్లపై తిరగనియ్యమని ముదిరాజ్ సంఘం హెచ్చరించారు. సుమారు 65 లక్షల మంది ముదిరాజ్ కులస్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు.ముదిరాజులకు క్షమాపణ చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగంగా ఉంటాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో మణుగూరు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కురం. శ్రీనివాస్,ఉపాధ్యక్షులు కురం. రవి కమిటీ సభ్యులు ఐయితనబోయిన రమేష్, తోడేటి వెంకటేశ్వర్లు,కురం వెంకన్న,ఆముదాల శ్రీను,దొప్ప వీరయ్య,పదిర నాగన్న,వీరన్న, ఆవుల.నరసింహారావు,అక్కి నరసింహారావు,దాసరి జంపయ్య,తోడేటి వీరభద్రం, రాజబోయిన శీను,సాధిని సాంబశివరావు,గాజుల నరసింహారావు,కురం.నాగరాజు,ఆముదాల.శ్యామల,ఐయితనబోయిన రాములు,పిట్టల సాంబశివరావు,కొమ్ము సోమయ్య,రాజ బోయిన రాంగోపాల్,ముదిరాజ్ సంఘం కమిటీ సభ్యులు,యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !