మన్యం న్యూస్ మణుగూరు: జూన్ 25
వాసవి క్లబ్,వాసవి వనిత వైభవం మణుగూరు వారి ఆధ్వర్యంలో డాన్ టూ డస్క్ అనే నినాదంతో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సేవా కార్యక్రమలలో ఉన్నటువంటిరైతులకు,సైనికులకులకు బారి ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించారు.పేద ప్రజలకు వస్త్రాలు,నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మాజీ సైనికులు మంగి. మల్లికార్జున్ యాదవ్,జగదీష్, రైతులు చిన్ని వెంకటేశ్వర్లు ను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు ఐఈసి ఆఫీసర్ బండారు.వెంకటేశ్వర్లు, ఐపిసి ఆఫీసర్ మల్లేశ్వర్, దోసపాటి నాగేశ్వర్ రావు,అర్ సి చిత్తలురి ఉమ రమేష్, జడ్ సి డీ.బ్రమ్మయ్య,ప్రెసిడెంట్ చితురి శేషు,నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.