మానవసేవయే మాధవసేవ..
ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో
గిరిజన రాజు కాలనీ వాసులకు పలు వస్తువులు వితరణ
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండురంగ పురం దగ్గర నరసం పేటకు సమీపంలో ఉన్న గిరిజన రాజీవ్ కాలనీ లో వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కొచ్చర్ల కమలారాణి ఆధ్వర్యంలో బట్టలు పండ్లు బిస్కెట్స్ బుద్దుని జీవిత చరిత్రను,సావిత్రి బాయ్ ఫూలే గారి పుస్తకాలను ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో నిస్సాహితకు గురైన అనేక వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతి ఒక్కరూ తనకున్న సంపాదనలో కొంత వారికి వెచ్చించి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మదర్శన్ సూక్తిని ప్రతి ఒక్కరిలో అలవర్చుకొని సమాజం హితం కోరుతూ తోటి వారిని ఆదరించాలని ఆమె కోరారు గిరిజన రాజీవ్ నగర్ లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే గుర్తించి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.కరెంట్ లేదు,కనీస వసతులు లేక వాళ్ళు పడే ఇబ్బందిని ప్రభుత్వం వారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా. కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో
కమిటీ మెంబెర్స్ స్రవంతి,నరేంద్ర,కీర్తన, షన్విత్,ముత్యాల హనుమంత్ రావు,వెంకన్న గౌడ్,రత్న బాయి తదితరులు పాల్గొన్నారు.