UPDATES  

 పోడు సాగు రైతులందరికీ పట్టాలిఇవ్వాలి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని డిమాండ్

 

మన్యం న్యూస్: జూలూరుపాడు, జూన్ 25, దరఖాస్తు చేసుకున్న ప్రతి పోడుసాగుదారుడికి పట్టాలు ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసాని అయిలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ ఆఫీసులో ఆదివారం జరిగిన మండల కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో లక్షల గిరిజన కుటుంబాలు అడవిని నమ్ముకుని పొడు వ్యవసాయం చేసుకుంటున్నారని, పొడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని నమ్మబలికి ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా, ఫారెస్ట్ అధికారులతో అనేకదాడులు చేయిస్తూ, గిరిజన రైతులను ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామని అనేకమైన వాగ్దానాలు చేసి రోజులు గడుస్తున్నా ఇవ్వకుండా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇస్తామనడం స్వాగతిస్తున్నామన్నారు. మండల వ్యాప్తంగా మూడువేల దరఖాస్తులు చేసుకుంటే కేవలం 1500 మంది రైతులకు మాత్రమే పట్టాలు ఇస్తుందన్నారు. రైతుకు ఎకరం, రెండెకరాలకు మాత్రమే పట్టాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం సాంకేతికలుస్తుందని తెలిపారు. పోడు రైతులకు అరకొర పట్టాలు ఇవ్వకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు పొడు పట్టా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఇండ్లు లేని నిరుపేదలందరికీ పక్కా ఇండ్లు మంజూరి చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, మండల కార్యదర్శి యాస నరేష్, కొమ్ముగూడెం మాజీ ఎంపీటీసీ ఈశ్వర్ నాయక్, మండల కమిటీ సభ్యులు వి చందర్, గార్లపాటి వెంకట్, గడిదేసి కనకరత్నం, శ్రీను, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !