మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
కొత్తగూడెం రెండవ టౌన్ సీ.ఐ గా బాధ్యతలు చేపట్టిన రమేష్ ను ఆదివారం జిల్లా క్రీడా సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ ప్రాంతం నుంచి రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో ఆడి పథకాలు సాధించిన ప్రతిభవంతులైన క్రీడాకారులు అనేకమంది ఉన్నారని తెలపడం జరిగింది. సి.ఐ రమేష్ మాట్లాడుతూ క్రీడాకారులకు నా వంతు సహాయ సహకారాన్ని అందిస్తానని నా వంతు ప్రోత్సాహం ఉంటుందని కొని ఆడారు. ఈ కార్యక్రమంలో టైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇనిగాల మొగిలి,జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కాశి హుస్సేన్, ఉపాధ్యక్షుడు ఆదినారాయణ,అసోసియేషన్ సభ్యులు సి.హెచ్ విటల్,జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ కే.కృష్ణారావు,జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.నిహారిక తదితరులు పాల్గొన్నారు.