ఇక “పాని’పట్టు యుద్ధం తప్పదు
గూడెం ప్రజల దాహార్తి కోసం దశల వారి ఉద్యమం
కొత్తగూడెం మున్సిపాలిటీ ముట్టడిస్తాం
సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాష
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి తీర్చకపోతే దశలవారీ ఆందోళన తప్పదని అవసరమైతే కొత్తగూడెం మున్సిపాలిటీని ముట్టడించి పెద్ద ఎత్తున మహిళలతో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాష హెచ్చరించారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం పరిధిలోని
రేగళ్ల కాలువ తండ వద్ద కిన్నెరసాని ఫిల్టర్ బెడ్ ను సందర్శించి , పైప్ లైన్ మరమ్మతు పనులను సిపిఐ ప్రతినిధి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా సాబీర్ పాష మాట్లాడారు.కొత్తగూడెం పట్టణ వ్యాప్తంగా గత మూడు నెలల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న కిన్నెరసాని పైపులైన్ల లీకేజ్ ల పేరుతో కొత్తగూడెం పట్టణంలో కిన్నెరసాని మంచినీళ్లు సరైన సరఫరా లేక నెలల తరబడి ప్రజలు నీటి కష్టాలను అనుభవిస్తున్నారని, మంచినీటి కష్టాన్ని తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు .అలాగే మంచినీటి సమస్య ఉత్పన్నమైనప్పుడు ప్రత్యామ్నాయ చర్యల ద్వారా ప్రజల నీటి కష్టాలను తీర్చాల్సిన యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలను గాలికి వదిలేసి ప్రజల్ని నీటి కష్టాల్లో నెట్టేసారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగూడెం వ్యాప్తంగా వార్డుకు రెండు మినీ వాటర్ స్కీములు గతంలో ఉండే వని అలాంటి మినీ వాటర్ స్కీములను రిపేర్ చేయించకుండా గాలికి వదిలేయడంలో నేడు సమస్యలు ఎదురవుతున్నాయని, తక్షణమే అన్ని వార్డుల్లో ఉన్న మినీ వాటర్ స్కీములు రిపేర్ చేసి వార్డుకు రెండు చేతిపంపులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చేశారు. అలాగే గత రెండు రోజుల క్రితం సిపిఐ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారని దానికి స్పందించిన అధికారులు వార్డుకు ఒకటి , రెండు ట్యాంకర్ల నీళ్లు పంపినంత మాత్రాన మంచినీటి సమస్య తీరదని అన్నారు . రేగళ్ల కాలువ తండా నుండి ఇల్లందు క్రాస్ రోడ్డు సంపు వరకు అలాగే కొత్తగూడెం వ్యాప్తంగా ఉన్న పాత పైపులు నిర్మాణాన్ని తొలగించి తక్షణమే నూతన పైప్ లైన్లు ఏర్పాటు చేసి గూడెం ప్రజల నీటి కష్టాలు తీర్చి శాశ్వత పరిష్కారం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కిన్నెరసాని నీళ్లు రాని రోజు మిషన్ భగీరథ నీళ్లు అందించాలని, అదనపు మోటార్లను ఏర్పాటు చేసుకొని మంచినీటి సమస్య ఉత్పన్నం కాకుండా అలాగే 24 గంటల కరెంటు ఉండేల చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులు కోరారు. లేకుంటే కొత్తగూడెం వ్యాప్తంగా వేలాది మంది మహిళలను సమీకరించి మున్సిపాలిటీ ని ముట్టడించి ఆమరణ దీక్ష కూడా ఎనకాడేది లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఫిల్టర్ బెడ్డును పరిశీలించి పైపులైన్ రిపేర్ పనులను సందర్శించిన వారిలో సిపిఐ పట్టణ కార్యదర్శి ,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై శ్రీనివాస్ రెడ్డి, పట్టణ సహాయ కార్యదర్శి మాచర్ల శ్రీనివాస్ ,మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ మునగడప వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు బానోతు చందర్, బానోతు శ్రీనివాస్, షాబుద్దీన్, నరేష్ ,కే లక్ష్మి తదితరులు ఉన్నారు.