మన్యం న్యూస్, దుమ్ముగూడెం జూన్ 25::
సమాచారం మాకు బహుమతి మీకు అనే నినాదంతో నిషేధిత మావోయిస్టు పట్టించాలని కోరుతూ సోమవారం దుమ్ముగూడెం పోలీసులు గుత్తి కోయ గ్రామమైన గద్దమడుగు గ్రామంలో గడపగడపకు మావోయిస్టు పట్టించాలని కోరుతూ స్టిక్కర్లను భద్రాచలం ఏ ఎస్ పి పంకజ్ ఆధ్వర్యంలో అంటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాలపై గద్దమడుగు గ్రామాన్ని సందర్శించి మావోయిస్టు సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు అమాయక ప్రజల్ని అభివృద్ధికి నిరోధకాలుగా మారి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ అమాయకపు ఆదివాసులు దోచుకుంటూ భయపడుతూ వారిని అభివృద్ధి దూరం చేస్తున్నారని కాబట్టి ఆదివాసి ప్రజలు ప్రశాంతమైన జీవనం కొనసాగించాలని తెలియజేశారు ప్రజలను ఎవరు కూడా మావోయిస్టులకు సహకరించొద్దని ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ సమాచారం అందించాలని మీ వివరాలు గోపయ్య ఉంచుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ ఎస్సై నర్సిరెడ్డి ఎస్సై కేశవరావు సిఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.