మన్యం న్యూస్ చండ్రుగొండ, జూన్ 26: విద్యార్థులు మత్తు పదార్దాలకు దూరంగా ఉండాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ శకుంతల అన్నారు. మిషన్ పరివర్తనలో భాగంగా సోమవారం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధుల చేత ప్రదర్శన, ప్రతిజ్ఞను చేయించారు.ఈ సందర్భంగా ఆమె విద్యార్ధులనుద్దేశించి మాట్లాడుతూ… విద్యార్ధి దశ నుండి యుక్త వయస్సు వచ్చే సరికి యువతి, యువకుల్లో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్ధాల వల్ల యువత వ్యసనపరులుగా మారుతున్నారన్నారు. రోగనిరోధకశక్తి తగ్గటం, ఆరోగ్యం క్షీణించడం, కుటుంబంలో కలహాలు ఏర్పాడతాయన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థలు యవతకోసం కృషిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఆనందకుమార్, ఐసిడిఎస్ సూకుర్వైజర్ రాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.