మన్యంన్యూస్ ఇల్లందురూరల్:- ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర 8వ మహాసభ జులై 4,5 తేదీలలో ఇల్లందులో నిర్వహిస్తున్న సందర్భంగా, మహాసభని జయప్రదం చేయాలనీ కోరుతూ ఇల్లందు మండల పరిధిలోని నాయకులగూడెం పెద్ద గుంపులో ప్రచార పోస్టరును ఆవిష్కరించారు.పీవైఎల్ నాయకులు సోలం నరేష్, పాయం రవి మాట్లాడారు. దేశంలో నిరుద్యోగ సమస్యను పాలకులు పెంచి పోసిస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులని బడా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి సంపద మొత్తం దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేట్ పరం చేస్తూ, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. మేధావులు, హక్కుల సంఘాల నేతలపై దేశద్రోహం కేసులు పెట్టి జైల్లో నిర్భందిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగాలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది అమరవీరుల ప్రాణ త్యాగాలతో సాధించిన తెలంగాణ లో నియామకాలు లేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందో యువత ఆలోచించాలని అన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో జబ్బ వసంతరావు, చింత మధుసూదన్, సువర్ణపాక రాంబాబు, పెనక ప్రవీణ్, పాయం జగదీష్, పెనక సునీల్, పూనెం వెంకటేష్, జబ్బ వినోద్, ఎట్టి జంపన్న, జబ్బ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.