మన్యం న్యూస్, మణుగూరు:
మణుగూరు మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు చెరుకు సుధ
గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ…స్థానిక సింగరేణి ఆసుపత్రి నందు చికిత్స చేయించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మణుగూరు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో ఆమెకు రూ.10000వేలు ఆర్థిక సహాయం అందించారు. ఎటువంటి ఆపద వచ్చినా రేగా అన్న ఎల్లప్పుడు మీ తోడుగా ఉంటారు. అనే భరోసా కల్పించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్,కీసర శ్రీనివాసరెడ్డి,వట్టం రాంబాబు,ఎక్సలెంట్ స్కూల్ చైర్మన్ యూసఫ్ షరీఫ్, శ్రీవిద్య విద్యాసంస్థల చైర్మన్ నూకారపు రమేష్,ఉబ్బని శ్రీను తదితరులు పాల్గొన్నారు.