మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలంలోని సత్య నారాయణ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డాక్టర్ మౌనికా అధ్వర్యంలో పెద్ద మిడిసిలేరు గ్రామం లో వైద్య శిబిరం నిర్వహించబడింది. దీనిలో భాగంగా ఇంటి,ఇంటి జ్వరం సర్వే చేసి,మురికి కాలువ లలో యాంటి లార్వాల్, టేమిఫోస్ ద్రావణం చల్లటం జరిగినది.జ్వరం కేసులు నమోదు కాలేదు.45 మందికి సాధారణ వ్యాధులకు చికిత్స చేయడం జరిగినది అని డి.పి.ఎం.ఓ, సత్య నారాయణ తెలిపారు. ఈ హెల్త్ కార్యక్రమంలో హెచ్.ఈ.ఓ బాబురావు,
హెల్త్ సూపర్వైజర్ అమ్మాజి,హెల్త్ అసిస్టెంట్స్ వేణు, వరప్రసాద్, కృష్ణవేణి,ఆశాలు కుమారి, నాగ లక్ష్మి,వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
