మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
దం శరణం గచ్చామి సంఘం చరణం గచ్చామి అంటూ సంఘంలో ప్రతి ఒక్కరు తోటి వారిని కాపాడాలని ప్రతి ఒక్కరూ హింసను వీడి అహింసా మార్గంలో పయనించాలని గౌతమ బుద్ధుడి బోధనలు మానవాళి మనుగడకు మార్గదర్శకాలుగా నిలిచాయని సింగరేణి డివైజియం చంద్రమౌళి అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం కారుకొండ గుట్టలపై ఉన్న బౌద్ధుని స్తూపాలను వారు సందర్శించి అనంతరం మాట్లాడారు. కష్టం వెనుక సుఖం ఉంటుందని కన్నీళ్ళ వెనక సంతోషం ఉంటుందని మనిషి అన్ని విధాలుగా ఆలోచించి మదనపడే కంటే తన అనుకున్న లక్ష్యం సాధించే దిశలో శాంతియుతంగా పోరాడి సాధించుకోవాలని గౌతమ బుద్ధుడు బోధించిన తీరు ప్రపంచవ్యాప్తంగా నేడు అనుసరిస్తుందని అన్నారు. ప్రపంచ శాంతిని నెలకొల్పేందుకు గౌతమ బుద్ధుడు ప్రపంచవ్యాప్తంగా తిరిగే క్రమంలో కారుకొండ గుట్టలపై వచ్చి సేద తీరడమే కాకుండా తన శిష్య బృందానికి అహింస పరమో ధర్మః బోధించిన జ్ఞాపకాలు కనబడుతున్నాయని అన్నారు గత కొన్నేలా పూర్వకాలం నాటి గౌతమ బుద్ధుడి ఆనవాళ్లను కారుకొండ గుట్టలపై ఉండడం ఎంతో గొప్ప వారం అన్నారు కారుకొండ గుట్టను ఒక పర్యటక ప్రాంతంగా ఏర్పాటు చేసి గౌతమ బుద్ధుని బోధనలు ప్రపంచవ్యాప్తంగా అనుసరించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. సందర్శించిన వారిలో సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంతోటిపాల్, డాక్టర్ ఇన్నయ్య కరుణాకర్ శన్విత్ కీర్తన , స్వామి,బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కన్వీనర్ కొచ్చర్ల కమలా రాణి, తదితరులు ఉన్నారు