UPDATES  

 బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తును పరిచయం చేస్తూ ఇంటింట ప్రచారం….

 

మన్యం న్యూస్ చండ్రుగొండ జూన్ 27 : మండల పరిధిలోని తుంగారం గ్రామపంచాయతీలో బహుజన సమాజ్ పార్టీ( బీఎస్పీ ) మండల అధ్యక్షుడు ఇనుముల పిచ్చయ్య ఆధ్వర్యంలో ఏనుగు గుర్తును పరిచయం చేస్తూ, ఇంటింటా బీఎస్పీ పార్టీ గురించి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బహుజన రాజ్యం స్థాపన కోసం ప్రతి ఒక్క బహుజనుడు కదిలి రావాలని పిలుపునివ్వడం జరిగిందని, రానున్న ఎన్నికలలో నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుక్కముడి చంటి, చాపలమడుగు నవీన్, అఖిం, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !