UPDATES  

 వాక్ ఫర్ యూత్ డిక్లరేషన్

వాక్ ఫర్ యూత్ డిక్లరేషన్
ముమ్మర ప్రచారంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గడ్డం రాజశేఖర్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ప్రియాంక గాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో భాగంగా రాజీవ్ క్విజ్ కాంపిటీషన్ పై యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గడ్డ గడ్డం రాజశేఖర్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రతి గడపగడప తిరుగుతూ ముమ్మర ప్రచారాన్ని చేపట్టారు.కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణంలోని యువజన కాంగ్రెస్ నాయకుడు మధు ఆధ్వర్యంలో విద్యుత్ కళాభారతిలో రాజీవ్ క్విజ్ కాంపిటీషన్ కోసం విస్తృత ప్రచారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ప్రతి ఒక విద్యార్థి నిరుద్యోగ యువత రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్న నేటికీ విద్యార్థి నిరుద్యోగ యువత కలలు నెరవేరలేదని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల విద్యార్థులకు నిరుద్యోలకు ఏం చేయబోతుందో ప్రియాంక గాంధీ నాయకత్వంలో విడుదల చేసిన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు తెలియజేసేలా ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని తెలియజేశారు.బట్టి విక్రమార్క చేపట్టిన పీపుష్మాష్ పాదయాత్ర ముగింపు సభ జులై 2వ తేదీన ఖమ్మంలో నిర్వహించడం జరుగుతుందని ఈ ముగింపు సభకు పెద్ద ఎత్తున విద్యార్థులు యువత అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా యూత్ కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్ మధు, మహమ్మద్ ఉస్మాన్, సాయి,మధు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !