మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా పండరిపూర్లో భారీసభను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన మహారాష్ట్ర సభలో ఇల్లందు శాసనసభ్యురాలు భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ పాల్గొన్నారు. అట్టహాసంగా జరిగిన ఈ సభలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ దిండిగల రాజేందర్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్షి తదితరులు పాల్గొన్నారు.