- రేగా కృషితోనే ప్రభుత్వ ఆసుపత్రికి పునర్ వైభవం*
డాక్టర్ నవీన్ వారి సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభినందన.
- ప్రజల మన్ననలు పొందుతున్న రేగా,జెడ్పిటిసి శ్రీలత.
- బూర్గంపహడ్ దవఖానలో వైద్య సేవలు భేష్.
- పురోగతిలో బూర్గంపహడ్ ప్రభుత్వ ఆసుపత్రి.
ఘన నీయంగా వైద్య సేవలు.
మన్యం న్యూస్ బూర్గంపహడ్:- కొన్నేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా తరుణంలో బూర్గంపహడ్ ప్రభుత్వ ఆసుపత్రి ఏప్పుడు కళకళలాడుతూ చుట్టూ ప్రక్కల గ్రామాలైన ప్రస్తుత కుక్కునూరు మండలంలో ఉన్న గ్రామాలు ఇబ్రంపేట,గణపవరం,బొనగిరి,అల్లిగుడెం,రావిగుడెం,శ్రీధర,సీతారామ నగరం మొదలుకొని పలు పల్లెటూర్లు బూర్గంపహడ్ దవాఖానలో పురుడ్లు మొదలుకొని ఏ వైద్యం అయిన ఈ ఆసుపత్రికి చేరుకుని వైద్య సేవలు పొందే వారు,ఇగ తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్ర విబాజనలో పలు కొత్త జిల్లాలు ఏర్పడడంతో పలు నూతన మండలాలుగా ఏర్పడి ఇట్టి గ్రామాలు బూర్గంపహాడ్ నుండి విడిపోయిన అనంతరం ఆ రోజు నుండి ఇట్టి ఆసుపత్రిలో వైద్యం కోసం ఆ గ్రామాల ప్రజలు వారి మండలంలో వైద్యం కి అలవాటు పడ్డారు ఇగ బూర్గంపహడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు సైతం వేరే జిల్లాలకు బదిలీ అయ్యి ఒక్కరూ లేదా ఇద్దరు డాక్టర్లు ఇక్కడ ఉంటు ప్రజలకు సరిగ్గా అందుబాటులో ఉండకుండా మొక్కుబడిగా విధుల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో లేక వారికి సరైన వైద్యం అందక ఇట్టి వైద్యశాలలో వైద్యం చేయించుకునే వారు కరువయ్యారు,ఇట్టి విషయం పై పలువరు ప్రజలు,నాయకులు బూర్గంపహద్ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత దృష్టికి తీసుకు పోగా ఇట్టి విషయన్ని ఛాలెంజ్ గా తీసుకున్న జెడ్పీటీసీ శ్రీలత ఇట్టి విషయం పై రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కి విషయం విన్నపించగా అతి తక్కువ సమయంలో జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత పట్టుదలతో రేగా కృషితో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులతో కూడిన పరికరాలు అదేవిధంగా పలువురు డాక్టర్ల,వైద్య సిబ్బంది నియామకం అదే విధంగా ఆసుపత్రి అభివృద్ధికి భవనాలు పరికరాలకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చిన ఘనత రేగాది,ఇగ ఇదంతా ఒక భాగం ఐతే ఆసుపత్రి లో వైద్యం డాక్టర్ల పనితీరు ఇక బాగం ఐతే ఈ నాడు దానిని నిరూపించుకొని శాభాష్ డాక్టర్లు అని పలువురి మన్ననలు పొందుతున్నారు,ఇట్టి ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగవడం పట్ల జిల్లా కలెక్టర్ బుధవారం సంతృప్తి వ్యక్తం చేశారు ఓపి సేవలు,ఇన్ పేషన్స్ సేవలు,ఎన్సిడి క్లినిక్ సేవలు గణనీయంగా పెరగడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.గతంలో రోజుకు 30 నుంచి 40 ఉన్న ఓపి సంఖ్య నేడు 170 నుంచి 200 కాగా,ఇన్ పేషంట్ లు రోజుకి మూడు నుండి 25 మంది కి చేరడం అదేవిధంగా రోగులకు ప్రతిరోజు భోజన ఏర్పాట్లు డాక్టర్ నవీన్ స్వయంగా వారికి అందిస్తు మెరుగైన వైద్యం అందించడం ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది అని చెప్పొచ్చు.ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని ఆయన అభినందించగా మరింత నిబద్ధతతో పనిచేసి ఆసుపత్రికి మంచి పేరు తీసుకొని రావాలని ఆయన కోరారు.వైద్యుల అభ్యర్థన మేరకు ఆపరేషన్ థియేటర్,అదనపు పడకలు,మార్చురీ రెన్యూవేషన్ మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.సుమారు రెండు కోట్ల 70 లక్షలతో కొత్త భవంతి నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో నిధులు మంజూరు కాగా టెండర్ దశలో ఉన్నాయని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని డి.సి.హెచ్.ఎస్ డాక్టర్ జి.రవిబాబు తెలిపారు.కలెక్టర్ అభినందనలు తెలిపిన డాక్టర్ నవీన్ తోపాటు కలిసిన వారిలో డాక్టర్ అనిత,హెడ్ నర్స్ శోభ,ఫార్మసిస్ట్ సురేష్,ల్యాబ్ టెక్నీషియన్ హరి,శివ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.