మన్యంన్యూస్ ఇల్లందురూరల్:- ఇల్లందు మండలం బాలాజీ నగర్ గ్రామ పంచాయతీకి చెందిన నిరుపేద మహిళలు మర్యాద పూర్వకంగా భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యను కలిసి గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ కాళీ స్థలంలో గృహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిని ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు. కొరం కనకయ్యను కలిసిన వారిలో సర్పంచ్ పాయం స్వాతి, ఎంపీటీసీలు మండల రాము, పూనెం సురేందర్, నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, చిల్లా శ్రీనివాస్, కాకటి భార్గవ్, గుగ్లోత్ నాగార్జున, రావూరి సతీష్, పాయం ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.