UPDATES  

 వైద్య సేవలు బేష్ బూర్గంపాడ్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సేవలను అభినందించిన జిల్లా కలెక్టర్

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో వైద్య సిబ్బంది సౌకర్యాలు కల్పన పట్ల పుష్ప గుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఓపి సేవలు, ఇన్ పేషన్స్ సేవలు, ఎన్ సి డి క్లినిక్ సేవలు గణనీయంగా పెరగడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గతంలో రోజుకు 30 నుంచి 40 ఉన్న ఓపి నేడు 170 నుంచి 200 కాగా, ఇన్ పేషంట్ లు రోజుకి మూడు నుండి 25 మంది కి చేరడం ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది అని అన్నారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు. మరింత నిబద్ధతతో పనిచేసి ఆసుపత్రికి మంచి పేరు తీసుకొని రావాలని ఆయన కోరారు. వైద్యుల అభ్యర్థన మేరకు ఆపరేషన్ థియేటర్, అదనపు పడకలు, మార్చురీ రెన్యూవేషన్ మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సుమారు రెండు కోట్ల 70 లక్షలతో కొత్త భవంతి నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో నిధులు మంజూరు కాగా టెండర్ దశలో ఉన్నాయి. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని డి సి హెచ్ ఎస్ డాక్టర్ జి రవిబాబు తెలిపారు. కలెక్టర్ ని కలిసిన వారిలో బూర్గంపాడు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్, అనిత,హెడ్ నర్స్ శోభ, ఫార్మసిస్ట్ సురేష్, ల్యాబ్ టెక్నీషియన్ హరి, శివ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !