మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఆర్టీసీ కార్మికుల కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని, ఉద్యోగం రీత్యా రిటైర్ అయ్యాక, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తనకున్న సమయంలో కృషి చేసిన చెరుకు భిక్షం ప్రజలు, కార్మికుల గుండెల్లో నిలిచి ఉంటారని సీపీఎం సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య అన్నారు.బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని స్థానిక ఉర్డుఘర్ లో జరిగిన చెరుకు భిక్షం సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ముందుగా అమరజివి చెరుకు భిక్షం చిత్రపటానికి సీపీఎం, సీఐటీయూ సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య, పి.రాజారావు, ఎమ్ ఎస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సీపీఎం లక్ష్మీదేవి పల్లి మండల కమిటీ సభ్యులు వాంకుడోత్ కోబల్ అధ్యక్షతన జరిగిన బిక్షం సంస్కరణ సభలో సిపిఎం సీనియర్ నాయకులు కాషాయం ఐలయ్య మాట్లాడుతూ ఆర్టీసీలో ఉద్యోగం వచ్చినప్పటి నుంచి చెరుకు బిక్షం కార్మికుల సమస్యల పట్ల వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసేవాడని ,ఉద్యోగ విరమణ తర్వాత కూడా జనం కోసం నిరంతరం పనిచేసేవాడని, ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ వెన్నంటే ఉండేవాడని అన్నారు . జనం కోసం పని చేసిన వారు ప్రజల గుండెల్లో ఎల్లకాలం జీవించే ఉంటారని చెరుకు బిక్షం నిరూపించాడని అన్నారు. వారి ఆశయ సాధన కోసం సిఐటియు సిపిఎం అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటియు నాయకులు లిక్కి బాలరాజు, అన్నవరపు సత్యనారాయణ, భూక్య రమేష్ ,వాంకుదోత్ ఆమర్సింగ్, వీరన్న ,జవహర్ రెడ్డి, సందకురి లక్ష్మి, మల్సుర్, వేము జాకబ్ తదితరులు పాల్గొన్నారు.