- ఎమ్మార్పీ ధరలకే ప్రజలకు మద్యం అందుబాటులో ఉంచాలి
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రి 10 వరకు వైన్ షాపులు నడపాలి
- జిల్లాలో సిండికేట్ దందాను అరికట్టాలి: డైఫి జిల్లా కార్యదర్శి కాలంగి హరికృష్ణ
మన్యం న్యూస్,ఇల్లందు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలకు, యువతకు ఎమ్మార్పీ ధరలకే మద్యం అందుబాటులో ఉంచాలని, ప్రజలు కష్టపడి పనిచేసి కూడపెట్టుకున్న సొమ్ము రాత్రికే మద్యం సిండికేట్ మహమ్మారి వల్ల ఇల్లు చేరడం లేదని కావున అన్ని రకాల బ్రాండ్లను వైన్ షాపులలోనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రి పదిగంటల వరకు విక్రయించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డైఫి) జిల్లా కార్యదర్శి కాలంగి హరిక్రిష్ణ అన్నారు. సిండికేట్ల పేరుతో ఆటోలలో బెల్ట్ షాపులకు ప్రజలు తాగేటువంటి బ్రాండ్లను సరఫరా చేసి ప్రజలకు నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో లేకుండా జేబులు ఖాళీచేసేలా చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే దీన్ని అరికట్టాలని, ఎక్సైజ్ శాఖవారు సిండికేట్ దందా మీద దృష్టిపెట్టి ప్రజలకు, యువకులకు అసౌకర్యం కలగకుండా ఎమ్మార్పీ ధరలకే వైన్ షాపులలో నిబందనల ప్రకారం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమయానికి అనుగుణంగా పర్మిట్ రూములలో మద్యం తాగడానికి వైన్ షాపులలో అందుకు అనుగుణమైన చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ప్రత్యక్షంగానే యువతను సమీకరించిన సిండికేట్ మహ్మమారిని అడ్డుకుంటూ వైన్ షాప్స్ ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో డైఫి జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న, జిల్లా నాయకులు రామకోటి, శివ, శ్రావణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.