మన్యం న్యూస్ కరకగూడెం: పరిధిలోని బట్టుపల్లి గ్రామంలొ గల మిని స్టేడియం కి వెళ్లే రోడ్డు నందు లక్కీ డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ సీట్ షాప్ ను కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల వ్యాప్తంగా మిర్చి రైతులు అధికంగా ఉన్నందున రైతులకు ఉపయోగపడే విధంగా డ్రిప్ ఇరిగేషన్,మల్చింగ్ సీట్ షాప్ పెట్టడం మిర్చి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ సందర్భంగా షాపు యాజమాన్యనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. మిర్చి రైతులు గతంలో డ్రిప్ కోసం జానంపేట,పాల్వంచ కొత్తగూడెం వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేసివారని ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా మన సొంత మండలంలో డ్రిప్ ఇరిగేషన్,మల్చింగ్ సీట్ షాప్ పెట్టడం వల్ల రైతులకు ఎంత ఉపయోగపడుతుందని తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు,సర్పంచ్ ల సంఘం మడల అధ్యక్షులు పాయం.నర్సింహరావు, ఊకె.రామనాధం,ఎడుళ్ళ బయ్యారం వ్యాపారవేత్త ముక్కు వెంకటనర్సారెడ్డి, బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల. సోమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
