మన్యం న్యూస్ గుండాల: ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించద్దని స్థానిక ఎంపీపీ ముక్తి సత్యం ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోనీ ఎమ్మార్సీ కార్యాలయంలో ఉపాధ్యాయులకు ప్రభుత్వం అందిస్తున్న ట్యాబులను పంపిణీ చేశారు. ఈ ట్యాబులలో పిల్లలకు సంబంధించిన మధ్యాహ్న భోజనం, టెక్స్ బుక్స్, ఏకరూప దుస్తులు, హాజరు తదితర వివరాలను ఏరోజుకారోజు అందించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కృష్ణయ్య, సీఆర్పీలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు .
