మన్యం న్యూస్ దుమ్ముగూడెం జూన్ 28::
పేద ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగపరుచుకోవాలని మానవ హక్కుల సంఘం, ఉచిత వైద్య శిబిర నిర్వహకులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి సూచించారు మండలంలోని ఆర్లగూడెం ఆశ్రమ పాఠశాల లో జూలై 01 తారీఖున శనివారం నాడు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ భద్రాచలం నీరజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిపిఐ పార్టీ వారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని వచ్చి వైద్య పరీక్షలు చేపించుకోవాలని సూచించారు మండలంలో ఇప్పటికే డెంగ్యూ జరాలతో ఇబ్బంది పడుతున్నారని పేద ప్రజల ఉపయోగ కోసం హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని అన్నారు వైద్య పరీక్షలు నిర్వహించిన వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు నోముల రామిరెడ్డి సిపిఐ నాయకులు తాటిపూడి రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు