మన్యం న్యూస్, పినపాక :
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో జూన్ 30న జరగనున్న పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం దేశవ్యాప్తంగా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించనుందని, ముఖ్యమంత్రి కేసిఆర్, పినపాక ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కృషి ఎనలేనిదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అన్నారు. పోడు పట్టాల సాధనే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితిలో చేరి, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి, మెప్పించి లక్షలాది ఎకరాలకు పోడుపట్టాలు సాధించిన ఘనుడు రేగా కాంతారావు అని ఆయన అన్నారు. జూన్ 30న పోడు పట్టాలు అందుకుంటున్న ఆదివాసి గిరిజన రైతుల తరఫున ముఖ్యమంత్రి కేసిఆర్, విప్ రేగా కాంతారావుకు కోలేటి భవాని శంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు.