-పోడు రైతులు ఎవరూ దిగులు పడకండి.
-ఏజెన్సీ ప్రాంత సమగ్రాభివృద్ధికి
ప్రభుత్వం కట్టుబడి ఉంది.
-విడతల వారీగా పోడు పట్టాల పంపిణీ.
-ములుగు జడ్పి ఛైర్ పర్సన్ బడే. నాగజ్యోతి.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ములుగు జిల్లాలోని అర్హులైన ప్రతి పోడు రైతుకు పట్టాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి అన్నారు. గురువారం ఆమె కన్నాయిగూడెం మండలంలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా పార్టీ శ్రేణులను, ప్రజలను కలుస్తూ మండలంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఏజెన్సీ మండలాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, శుక్రవారం నుండి పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పట్టాలు అందని రైతులు ఎవరు దిగులు చెంద రాదని, విడుతల వారీగా ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు అందరికీ పట్టాల పంపిణీ చేస్తుందని పట్టాల పంపిణీ విషయంలో ఏవైనా అవకతవకలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆమె అన్నారు.ఆమె వెంట జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య,మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సబ్బుల సమ్మయ్య,చిన్ని కృష్ణ, పూజారి సత్యనారాయణ నామ తిరుపతి,దేవర సుధాకర్,మాఊరి వెంకటయ్య, వాసంపల్లి రాంబాబు,నరేడ్ల అశోక్,ఎంపీటీసీ ఆలం రాంబాబు,గోస్కుల రాంబాబు,
సీనియర్ నాయకులు మాదరి రామయ్య,ఏటూరు నాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.