మన్యం న్యూస్ కరకగూడెం:కరకగూడెం మండల కేంద్రంలోని కరకగూడెం గ్రామంలోని నూతనంగా ఎర్పాటు చేసిన ప్రవేటు వైద్యశాలను ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎంబీబీఎస్ పూర్తి చేసి మణుగూరు మండలంలో ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులుగా పని చేస్తున్న డాక్టర్ బైరిశెట్టి దుర్గ నరేష్. తన పుట్టిన గ్రామానికి కరకగూడెం మండల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే దృక్పధంతో ఉచిత వైద్యం అందిస్తూ ఔదార్యం చాటుకుంటు ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు. మండల కేంద్రంలో ఉచిత వైద్యశాల ఏర్పాటు చెయ్యడం సంతోషంగా ఉందన్నారు.
అలాగె మారుమూల ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ దుర్గ నరేష్ అభినంచిన ఆయన శాలువాతో సన్మానించి అభినందించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాలని తెలిపారు.
అనంతరం డాక్టర్ దుర్గ నరేష్ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి ప్రజలకు సేవ చేయాలని వైద్య వృత్తిని ఎంచుకుని నిరుపేదలకు ఉచిత వైద్యం చేయాలని నేను పుట్టి పెరిగిన నా ప్రజలకు సేవ చేయడంలో ఆనందం ఉందన్నారు. ప్రజలు ప్రైవేటు వైద్యశాలలకు, ఆర్ ఎంపీల వద్దకు వెల్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి రేగా కాళికా, సర్పంచ్ ఊకె.రామనాథం, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
