మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని వట్టంవారి గుంపు గ్రామపంచాయతీలోని గ్రామాలలోని విస్తృతంగా పర్యటించే ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజలతో ముఖాముఖి సమావేశం అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ముఖమూఖి సమావేశం ఎర్పాటు చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు పలు రకల సమస్యలను తన దృష్టికి తిసుకోని రావడంతో కొన్ని సమస్యలను వెంటనే పరిష్కారం చేసి కొన్ని సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తాను అని హమి ఇచ్చారు. అలాగే చిరుమళ్ళ గ్రామనికి చెందిన బోడ.రాము ఇల్లు ఇటీవల కొన్ని రోజుల క్రితం ప్రమాదశాత్తు కాలిపోవడంతో వారి నివాసానికి వెళ్లి ప్రమాదం జరిగిన తిరుని అడిగి తెలుసుకోని వేగా విష్ణు చారిటబుల్ సహకరంతో స్వయంగా వంట సామాగ్రి షాపు కి వెళ్ళి సామాన్లు కొనుగోలు చేసి కుటుంబానికి ఐదువేల రూపాయలు,25 కెజి ల బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా, స్థానిక సర్పంచ్ అరెం.సాంబ,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు పాయం.నర్సింహరావు, ప్రజాప్రతినిధులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
