మన్యం న్యూస్ కరకగూడెం: జులై రెండవ తేదీన ఖమ్మంలో జరిగే తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగే జన గర్జనను విజయవంతం చేయాలని ఆయన అన్నారు. అలాగే ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే,కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ,టి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ అధ్యక్షులు నాగబండి. వెంకటేశ్వర్లు, యువజన నాయకులు కునుకుసోత్ సాగర్ పాల్గొన్నారు.
